రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Advertisements

<p>రాష్ట్రంలో ప్రభుత్వ పాలన&comma; వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్&comma; పబ్లిక్ పర్సెప్షన్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; ఈ నెల నుంచి ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి కనీసం 80 నుంచి 90 శాతానికి తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు&period;<br &sol;>&NewLine;ప్రజా సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించకూడదని సీఎం హెచ్చరించారు&period; ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో ఇంకా లోటుపాట్లు ఉన్న గ్రామాలు&comma; వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు&period; అట్టడుగు స్థానంలో ఉన్న ప్రాంతాల్లో కూడా పంపిణీ సమర్థంగా జరగాలన్నారు&period; అలాగే&comma; దీపం పథకం కింద అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు&period; ప్రజారవాణాపై సమీక్షిస్తూ&period;&period; ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగానే ఉన్నప్పటికీ&comma; బస్టాండ్లలో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు&period; ముఖ్యంగా పుంగనూరు&comma; వెంకటగిరి&comma; పెనుకొండ&comma; ప్రొద్దుటూరు&comma; ఎమ్మిగనూరు&comma; శ్రీకాళహస్తి బస్టాండ్లలో తాగునీరు&comma; టాయిలెట్స్&comma; ఫ్యాన్స్&comma; సీటింగ్ ఏర్పాట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు&period; ప్రయాణికుడు బస్టాండ్‌కు వచ్చిన దగ్గరి నుంచి గమ్యస్థానం చేరేవరకూ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని&comma; రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో టాయిలెట్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలో వరుస ప్రమాదాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు&period; బాణసంచా పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు తమిళనాడులోని శివకాశీకి వెళ్లి అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు&period; రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై చర్చిస్తూ&&num;8230&semi; స్లాట్ బుకింగ్&comma; డిజిటల్ సేవలపై ప్రజల్లో సంతృప్తి ఉందని అధికారులు వివరించారు&period; దీనిపై స్పందించిన సీఎం&comma; అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలోని మొత్తం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయతీ కలిగిన అధికారులకే బాధ్యతలు ఇవ్వాలని సూచించారు&period; ప్రజల సమస్యల పరిష్కారానికి వాట్సాప్ మనమిత్ర సేవలను నూటికి నూరు శాతం వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు&period; అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..

తమిళనాడు అన్నాడీఎంకేలో చీలికలు..

స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల…