99
తెలంగాణ ఎన్నికలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని జోస్యం చెప్పారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి లక్ష 20వేల మెజారిటీ వచ్చిందని, కొడంగల్‌లో అంతకంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. నాకోసం కాదు.. మీకోసమేనన్నారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా?కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.