విజయవాడలో చంద్రబాబుకు ఘనస్వాగతం

chandrababu

Advertisements

&NewLine;<p>స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు&period; రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు&period; ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది&period; రాత్రి 3&period;30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది&period; అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు&period; &OpenCurlyQuote;జై చంద్రబాబు&comma; జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో మారుమోగించారు&period; విజయవాడ నిర్మలా కాన్వెంట్&comma; బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి&period; కనకదుర్గ వారధి&comma; తాడేపల్లి&comma; ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు&period; గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు&period; తెల్లవారుజామున 4&period;45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కి అపూర్వస్వాగతం లభించింది&period; విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు&comma; కార్యకర్తలు&comma; అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు&period; పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు&period; ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్&comma; గద్దె అనురాధ&comma; నెట్టెం రఘురామ్&comma; నక్కా ఆనంద్ బాబు&comma; దేవినేని ఉమ&comma; తంగిరాల సౌమ్య&comma; ఆచంట సునీత&comma; నాగుల్ మీరా&comma; కేశినేని చిన్ని&comma; ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు&period; కాగా మంగళవారం సాయంత్రం 4&period;15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు&period; అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది&period; మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు&period; బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు&comma; ఫైర్ స్టేషన్&comma; వినాయకుడి గుడి&comma; ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు&period;మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు&period; బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు&comma; ఫైర్ స్టేషన్&comma; వినాయకుడి గుడి&comma; ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.