గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురుదేవో మహేశ్వర అనే సూక్తికి మచ్చని తీసుకు వస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే వక్రబుద్ధితో విధ్యార్హులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులు పట్ల అదే స్కూల్లో పనిచేస్తున్న టీచర్ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. గత శనివారం మధ్యాహ్నం పాఠశాలలో ఇతర టీచర్లు లేని సమయంలో విద్యార్థులను స్టాఫ్ రూమ్ కి పిలిపించి వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తమకు పిల్లలు చెప్పారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. సోమవారం ఉదయం స్కూల్ ప్రారంభం కాగానే విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కీచక టీచర్ ఈరోజు పాఠశాలకు హాజరు కాకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు ఇతర టీచర్లు, విద్యార్థులతో మాట్లాడి విచారణ చేపట్టారు.
విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్
117
previous post