95
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీతో చేతులు కలిపి.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధాని కి దారా దత్తం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప ఉక్కును స్థాపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.