అధికారం కోల్పోయి డీలా పడిన బీఆర్ ఎస్ పార్టీ క్యాడర్‌ను.. టార్గెట్ చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించే పనిలో బీజేపీ నేతలు పడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నేతలు ఎలాగూ బీజేపీ వైపు వచ్చే పరిస్థితి లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితేనే సులభంగా పార్టీలో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుని 8 ఎంపీ సీట్లను గెల్చుకున్నప్పటికీ పార్టీలో ఎవరూ చేరడం లేదు. పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఈటల అయితేనే ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తాడని భావించిన బీజేపీ హైకమాండ్.. ఈటలను చేరికల కమిటీకి ఛైర్మన్ గా నియమించింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు బీజేపీ చేరారు. అయితే ఆ తర్వాత ఎవరూ కూడా కమలం వైపు ఆసక్తి చూపడం లేదు. అయితే బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీలో చేరేందుకు చాలా మంది క్యూ కడుతున్నారని చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి