BJP Party
చేవెళ్ళ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం హోరుగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ రోజు షాబాద్ మండలంలోని సోలిపేట, మద్దూరు, హైతబాద్, నాగర్ గూడ, తిర్మాలపుర్, దోస్వాడ మరియు తాళ్లపల్లి గ్రామాలలో బీజేపి అభ్యర్ధి రత్నం ప్రచారానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఒక దొంగని అన్ని పదవులను తన కుటుంబం వారే అనుభవిస్తున్నారని ఆ కుటుంబ పాలన అంతమెందించడమే బిజెపి లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి అయిన భీం భారత్ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని క్రిమినల్ కేసులు గల వ్యక్తి అని వారికి మీరు ఓటు వేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నీ మేమే అందిస్తున్నామని చెప్పుకుంటూ మోసపూరితమైన మాటలు చెప్తున్నారని వాటిని ప్రజలు ఎవరు నమ్మవద్దని బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. షాబాద్ ను డెవలప్ చేశామని అంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం చందనవెల్లి రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం ఎందుకు ఇయ్యలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు ముందు చందన వెళ్లి రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించవలసింది ఆయన కోరారు మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఉన్న భూములు కూడా గుంజుకుంతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Also..
నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలము లోని కొలనూరు, ధర్మారం, మర్తన్నపేట, మల్కపేట గ్రామాలలో బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వ గురు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలందరూ హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారని, దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ లో నిలపనున్నట్లు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిజెపి ఈ నియోజకవర్గంలో గెలుపు ఖాయమన్నారు.
కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు. తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని, సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని, చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని, కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని, ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని, కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాల ఆందోళన..!
విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీతో చేతులు కలిపి.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధాని కి దారా దత్తం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప ఉక్కును స్థాపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7 న ఎల్బీస్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభకు హాజరైన ప్రధాని మోదీ.. ఈ నెల 11న మరోసారి తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’కు హాజరుకానున్నారు. రెండు రోజుల వ్యవధిలో ప్రధాని మరోసారి హైదరాబాద్ కు వస్తుండటంతో సభ ఏర్పాట్లపై రాష్ట్ర నాయక త్వం దృష్టి పెట్టింది.
అనంతరం గజ్వేల్ నుండి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో చేసుకున్నాం రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కెసిఆర్ కు ఓటు వేసి రుణ తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే కెసిఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది.




Total views : 61692