63
మహబూబాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు బానోత్ శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తన క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరి ఎలాంటి హడావుడి లేకుండా పార్టీ సీనియర్ కార్యకర్తలతో మరియు మంత్రి సత్యవతి రాథోడ్ బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ మాట్లాడుతూ నేడు మొదటి విడత నామినేషన్ దాఖలు చేశానని మరో రెండు సెట్లు కూడా దాఖలు చేస్తానని ప్రజలంతా కూడా మరోసారి కారు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈసారి నాకు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు..
Read Also..