శివరామ్‌ రాథోడ్‌కు బెయిల్‌

Shiv Ram Rathod

Advertisements

&NewLine;<p>ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్‌ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్‌ మంజూరు చేసింది&period; రూ&period;5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్‌ ఇస్తూ ఆదేశాలిచ్చింది&period; గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు&period; విచారణ చేపట్టిన కోర్టు&period;&period; ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్‌ మంజూరు చేసింది&period;వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్‌ హాస్టల్‌లో ఉంటోంది&period; గతవారం ఆమె హాస్టల్‌ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నది&period; ఈ ఉదంతంపై ఐసీపీలోని 417&comma; 420&comma; 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు&period;శివరామ్‌ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు&period; కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు&period; అయితే&comma; ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం&period;&period; శివరామ్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్‌ మంజూరు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు..