శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

Advertisements

<p>శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖద్రీ లక్ష్మీనరసింహస్వామి  బ్రహ్మ ఉత్సవాలలో భాగంగా బ్రహ్మ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు&period; శ్రీవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక  పూజ కార్యక్రమాలు నిర్వహించిన  అనంతరం రథాన్ని కదిలించారు&period; కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు&period; అనంతరం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆలయ అర్చకులు&comma; భక్తులతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రథాన్ని లాగారు&period; ఆంధ్రతో పాటు తెలంగాణ&comma; కర్ణాటక&comma; తమిళనాడు రాష్ట్రాల నుంచి  లక్షల మంది భక్తులు హాజరయ్యారు&period; ఇసుకవేస్తే రాలనంత భక్తులతో గోవింద నామస్కరణాలతో కదిరి పట్టణం మారుమోగింది&period; శ్రీవారికి దవనం&comma; మిరియాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు&period; రథాన్ని లాగేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు&period; దాతలు భక్తులకు ఉచిత అన్నదానం&comma; త్రాగునీరు ఏర్పాటుచేశారు&period; జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు&period; డ్రోన్ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.