సాంకేతిక రంగంలో – భారతీయ అమెరికన్లు

Indian-Americans

Advertisements

&NewLine;<p>అమెరికాలో అత్యున్నత సైంటిఫిక్ పురస్కారం ఇద్దరు భారతీయ అమెరికన్లను వరించింది&period; అశోక్ గాడ్గిల్&comma; సుబ్ర సురేష్ లకు &OpenCurlyQuote;నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ అవార్డును అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బహూకరించారు&period; అశోక్ గాడ్గిల్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు&period; సుస్థిరాభివృద్ధిపై ఎన్నో ఆవిష్కరణలకు గాడ్గిల్ కృషి చేశారు&period; శుద్ధ జలం&comma; ఇంధన సామర్థ్యం&comma; మెరుగైన శుభ్రత కోసం సమర్థవంతమైన సాంకేతికతల అభివృద్ధిపై గాడ్గిల్ కృషి చేస్తున్నారు&period; గాడ్గిల్ ముంబైలో జన్మించారు&period; యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫిజిక్స్ లో పట్టా పొందారు&period; ఐఐటీ కాన్పూర్ లో పీజీ పూర్తి చేశారు&period; యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా నుంచి ఎంఎస్ సీ&comma; పీహెచ్ డీ పట్టాలు పొందారు&period; ఇక సుబ్ర సురేష్ బయో ఇంజనీర్&comma; మెటీరియల్ సైంటిస్ట్ గా సేవలు అందిస్తున్నారు&period; మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాజీ డీన్&period; గౌరవ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు&period; ఇంజనీరింగ్&comma; ఫిజికల్ సైన్సెస్&comma; లైఫ్ సైన్సెస్&comma; మెడిసిన్ లో ఆయన అధ్యయనాలు చేస్తుంటారు&period; ముంబైలో జన్మించిన సురేష్ ఐఐటీ&comma; మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు&period; లోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ&comma; మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పట్టా పొందారు&period; సాంకేతిక రంగంలో అసాధారణ సేవలు అందించిన వారికి నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డులను ఏటా అందిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.