స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు

skill development case

Advertisements

&NewLine;<p>స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు ‌హైకోర్టు నిరాకరించింది&period; వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది&period; తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు సైతం నివేదికలు ఇచ్చారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు&period; ఈ ఏడాది జూన్‌లో ఎడమ కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు&period; సెప్టెంబరులోపు కుడి కంటికి సైతం చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారన్నారు&period; ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిన కారణంగా అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరమని వివరించారు&period; జాప్యం చేస్తే చూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు&period; దీనిపై కంటి వైద్య నిపుణులు ఈనెల 21à°¨ ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు&period; మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ విచారణ జరపనుంది&period; హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్‌ ముందు ఈ పిటిషన్‌ విచారణ జాబితాలోకి వచ్చింది&period; చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు&comma; వారి ఫోన్‌ కాల్‌ డేటా రికార్డులను భద్రపరిచేలా ఆదేశించాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది&period; ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు&period; ఈ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌ దాఖలుచేసింది&period; కాల్‌ డేటా బయటకు వెల్లడించడం వల్ల దర్యాప్తు అధికారుల భద్రతకు నష్టం కలుగుతుందన్నారు&period; గోప్యతకు భంగం కలుగుతుందని పేర్కొంది&period; చంద్రబాబును అరెస్టు చేసి సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో తమ అనుమతి లేకుండా మీడియా&period; వీడియో&comma; ఫోటోలు తీసుకుందన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్‌.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.