అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి… ఆ మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. సంగారెడ్డిలో విజయభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీస్ అమలవుతున్నాయని… ఈ విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. ఇందిరాగాంధీ గతంలో మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బీహెచ్ ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పెట్టారని.. ఇదీ వారు ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే మంచి వ్యక్తిత్వానికి నిదర్శమన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. రాష్ట్రం ఏర్ప డేటప్పుడు మిగులు బడ్జెట్ తొమ్మిదేళ్లలో ఉంటే అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పరిపాలన తీరును విమర్శించారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..జగ్గారెడ్డిని సంగారెడ్డి లో50వేల అధిక్యంతో గెలిపించాలని కోరారు..జగ్గన్న.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.పని మంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైల్లో వేసి చిప్ప కూడు తినిపించాలి. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
హామీలిచ్చి మాట తప్పిదం..
99
previous post