ఏపీలో పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు..

Advertisements

<p>పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని&comma; ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు&period; అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు&period; పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఏర్పాటు చేసిన గ్రామీణ అన్న క్యాంటీన్‌ను ఆయన కార్మికులతో కలిసి ప్రారంభించారు&period; ఈ సందర్భంగా 5 రూపాయలు ఇచ్చి టోకెన్ కొనుగోలు చేసి&comma; అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు&period; అంతకుముందు&comma; క్యాంటీన్‌కు వచ్చిన పేదలకు&comma; కార్మికులకు ఆయనే స్వయంగా వడ్డించారు&period;<&sol;p>&NewLine;<p>పేదవాడి ఆకలి తీర్చడానికే ప్రజా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చిందని&comma; ఎన్టీఆర్ 2రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారన్నారు&period; అదే స్ఫూర్తితో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు&period; 2024లో అధికారంలోకి రాగానే తొలుత పట్టణాల్లో&comma; ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు&period; కొత్తగా 62 గ్రామీణ క్యాంటీన్లు ప్రారంభం కావడంతో&comma; రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరిందని&comma; త్వరలో మరో 5 సిద్ధమవుతాయని వివరించారు&period;<&sol;p>&NewLine;<p>అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజూ 2&period;10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారని&comma; దీనికోసం ప్రభుత్వం రోజుకు 54 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు&period; నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు&period; కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్ల నిర్మాణానికి 43 కోట్లు&comma; వాటి నిర్వహణకు ఏడాదికి అదనంగా 58 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు&period; గత పాలకులు అన్న క్యాంటీన్లను మూసేసి పేదల పొట్టగొట్టారన్నారు&period; వారికి విధ్వంసం&comma; హింస&comma; కూల్చడం మాత్రమే తెలుసునని&&num;8230&semi;&period; అందుకే ఆ పార్టీ పేరును గొడ్డలి పార్టీగా మార్చుకోవాలన్నారు&period; ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతను వైసీపీ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..