78
తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మొద్దని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. గ్యారెంటీల పేరుతో దేశ వ్యాప్తంగా ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నిందని కుమారస్వామి విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. కర్ణాటకలో అమలుచేయలేని వారు తెలంగాణలో అమలు చేస్తామని చెప్పడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.