హైదరాబాద్, నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్‌కు గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై కేసీఆర్ దిగ్భ్రాంతి
72