తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు. వివరాల ప్రకారం రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది. రాజ్‌భవన్‌కు సామాగ్రి చేరుకుంటోంది. మూడు దిసెంలలో టెంట్లు, స్టాండ్స్, టేబుల్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నిచర్ చేరుకుంది. రాజ్ భవన్‌కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా. గవర్నర్ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు వికాస్‌రాజ్ అందజేయనున్నారు. ఇక, నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్ అని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి.
governor
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ఈనేపథ్యంలో కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
హైదరాబాద్, నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్‌కు గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి డాక్టర్ మాణిక్ సాహా, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం నూతన గవర్నర్ కు సాయుధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించాయి. అనంతరం ప్రముఖులను ముఖ్యమంత్రి కొత్త గవర్నర్ కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధాని కార్యాలయ అధికారులు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ దంపతులు బుధవారం నాడు అగర్తలా చేరుకున్నారు . ఆ సమయం లో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ , అతని మంత్రివర్గ సహచరులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు, సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయం లో ఘన స్వాగతం పలికారు. అక్కడ కొత్త గవర్నర్ కు “గార్డు -ఆఫ్ -హానర్” నిర్వహించారు. ఈ సందర్భం గా తన నియామకం పై రాష్ట్రపతికి , ప్రధాని కి, కేంద్ర హోమ్ మంత్రి కి నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు పారదర్శకత , జవాబుదారీతనం పాటించాలని , సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పలుపునిచ్చారు. ఈ సందర్భం గా అనేకమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు గవర్నర్ కు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులు పూల దండలతో నల్లు ఇంద్రసేనా రెడ్డి గారిని సత్కరించారు .



Total views : 78852