చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ వెన్నంట ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అలాంటి బాల్క సుమన్ కు విద్యార్థి లోకం నిరసన తెలియజేస్తోంది. ఓయూలో ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. యువ ఎమ్మెల్యేను ఓడించేందుకు ఓయు జేఏసీ సిద్ధమైంది. ఈ ఎన్నికలలో బాల్క సుమన్ ను ఓడించాలని ఓయూ జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. గుండా రాజకీయం చేస్తున్నాడని, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాల్క సుమన్ లాంటి ఎమ్మెల్యేలే కారణం మంటూ ఓయూ జేఏసీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బాల్క సుమన్ కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుండి వచ్చాయని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాన్ని అంతమొందించాలని విద్యార్థి లోకం పిలుపునిస్తోంది. విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి నాయకుడుకైనా గెలుపోటములు నల్లేరు మీద నడకే అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also..