నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కారు గుర్తు ప్రచారం స్పీడ్ పెంచింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి నేడు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంజనేయస్వామి గుడి లేని ఊరు తెలంగాణ పల్లెలో లేదు అలాగే కెసిఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు కూడా ఈ తెలంగాణ పల్లెలో లేదు అంటూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారంలో ప్రసంగించారు. 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడోసారి గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని మర్రి అన్నారు. ఇదిలా ఉంటే మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి మర్రి జమున రాణి బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఓటర్లను ఆమె కోరారు. మూడోసారి మరి జనార్దన్ రెడ్డి గెలవడం, కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం, టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు.
స్పీడ్ పెంచిన కారు ప్రచారం..
76
previous post