ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1లక్ష 60వేల 83 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియలో ఉన్నాయని… తమ కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ పిల్లలకు చెప్పండని.. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదంటూ ఎద్దేవా చేశారు. ప్రజెంటేషన్ ఇచ్చి… ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండన్నారు. గుజరాత్‌లో 6 కోట్లు, రాజస్థాన్‌లో ఎనిమిదిన్నర కోట్ల జనాభా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదన్నారు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో తాము 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపారు. ఇవి వాస్తవాలని.. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్‌సైట్ కూడా పబ్లిష్ చేశామని పేర్కొన్నారు. ఇవి వాస్తవాలు కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా.. అంటూ ప్రశ్నించారు. ప్రైవేటు సెక్టార్‌లో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించి, ఉపాధి కల్పించామని కేటీఆర్ తెలిపారు.
రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా…!
37
previous post