తెలంగాణ ప్రజల ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అందుకే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన హైదరాబాద్ సోమాజీగూడలో మీడియాతో మాట్లాడారు. 1200 మంది యువత బలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, కాని నేడు రాష్ట్రంలో యువత, రైతులు నైరాశ్యంలో ఉన్నారని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. తెలంగాణలో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజు వేలంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ సహకరించకపోయినా మోదీ తెలంగాణ అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. 2.5 లక్షల ఇళ్లు తెలంగాణలో కట్టామన్నారు. బుజ్జగింపు రాజకీయాలతో కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చరని ఆయన విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది – కేంద్రమంత్రి
62
previous post