మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది. టీ వర్క్స్‌లో స్టూడెంట్ ట్రైబ్ భేటీలో చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీ వర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, అలాగే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని, తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ… కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. రేపు మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు
61