78
కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీల వర్షం కురిపించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తామన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల భీమా అందిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ దశలవారీగా ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు.