75
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. శనివారం శ్రమ శక్తి భవన్‌లో హైబ్రిడ్ మోడ్‌లో తెలుగు రాష్ట్రాల అధికారులతో దాదాపు గంటకుపైగా కేంద్ర జలశక్తి శాఖ అధికారుల సమావేశం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో ఏపీ, తెలంగాణ అధికారులు విడుదల చేస్తారని సెంట్రల్ వాటర్ కమీషన్ ఛైర్మన్ వెల్లడించారు