74
గాంధీజీ కలలుకన్నా గ్రామస్వరాజ్యం సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం అగ్రహగోపవరం గ్రామంలో 43లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామసచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే వాసుబాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జిల్లా మండల కేంద్రాల్లో కేంద్రీకృతమయ్యే ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల వద్దకే సేవలు అందేలా గ్రామగ్రామనా సచివాలయాలు ఏర్పాటుచేసి సీఎం నూతన నవశకానికి నాంది పలుకుతున్నారని, గాంధీజీ కలలు కన్నా గ్రామస్వరాజ్యం జగనన్న పాలనలో నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.