35
భారత దేశ మొదటి వ్యవసాయ శాఖ మంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా.. దేశ వ్యాప్తంగా అగ్రీకల్చర్ ఎడ్యుకేషన్ డే గా నిర్వహించారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోని ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అగ్రిటెక్ ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఈ సంద్భరంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రావ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం, మరియు వారి ఆభివృద్ది కోసం ఆగ్రిటెక్ ప్రదర్శనను ఈనెల 3నుంచి 5వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం రైతులకి అవగాహన చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపతుందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం పై ప్రత్యేక మైన దృష్టి సారించారని వాక్యానించారు.