ఏపీ మాజీ సీఎం జగన్‌పై ఆయన తల్లి వైఎస్ విజయమ్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. నోటరీ ద్వారా ఆస్తుల పంపిణీ వివరాలను వెల్లడించిన ఆమె… షర్మిలను సమర్థిస్తూ, జగన్‌పై విమర్శలు చేశారు. వైఎస్ చనిపోయే నాటికి ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులేనని, పంపకాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆస్తులు నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని వెల్లడించారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు, కోడలికి అన్యాయం చేశాడని అన్నారు. ఎప్పటికైనా ఈ విషయంలో న్యాయం చేస్తాడని తల్లిగా భావిస్తున్నానని విజయమ్మ తెలిపారు. అలాగే MOU లో షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి ఆమెకు చెందాల్సిందేనని.. అందుకే జగన్ కూడా దీన్ని రాశాడని చెప్పారు. అంతేకాదు నిజానికి ఆమెకు తక్కువే రాశాడని… సరస్వతి సిమెంట్‌తో సహా MOU లో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని విజయమ్మ స్పష్టం చేశారు. అలాగే జగన్ ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే అన్నారు. ఆస్తుల పంపకం జరగలేదని మరోసారి స్పష్టం చేసిన విజయమ్మ… నిజం ఏంటో దేవుడికి, తన కొడుక్కి తెలుసని నోటరీ ద్వారా వెల్లడించారు.
#Jagan
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్లకండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్యే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014 లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్దికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు. కాగా, గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సింహాచలంలో వైభవంగా శ్రావణ శుక్రవారం పూజలు.విశాఖపట్నం సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో తొలి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తుండటంతో.. ప్రత్యేక పూజలకు భక్తులు…
- బాలానగర్‌లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.హైదరాబాద్ బాలానగర్‌లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
- అత్యల్ప ఉత్పాదకతతో ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాలు.లోక్‌సభ వర్షాకాల సమావేశాలు ఈసారి అత్యంత తక్కువ ఉత్పాదకతతో ముగిశాయి. నిర్ణయించిన మొత్తం సమయంతో పోలిస్తే లోక్‌సభలో కేవలం 15 శాతం మాత్రమే కార్యకలాపాలు జరిగాయని PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాలు వెల్లడించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యల్ప ఉత్పాదకత నమోదైన…
- మహబూబ్ నగర్ భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన మహబూబ్ నగర జిల్లాలోని భూత్పూర్ ఠాణా ఎదుట చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ముందున్న లారీ టైరు పేలిపోవడంతో బస్సును అదుపుచేసే క్రమంలో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో దాదాపు…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వివేకా హత్య కేసులో సీఎం పాత్ర..
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు కుట్రలో జగన్ హస్తం ఉందని, అందుకే కేసు దర్యాఫ్తునకు ఆటంకం కలిగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం మీడియాతో మాట్లాడుతూ సొంత చెల్లెలికే న్యాయం చేయని వ్యక్తి ప్రజలకు మాత్రం ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. బాబాయ్ హత్య కేసు విచారణను అడ్డుకుంటున్నాడని జగన్ పై ఆరోపణలు గుప్పించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అవినీతికి అంతేలేకుండా పోతోందని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: జగన్ రాయలసీమ ద్రోహి- టీడీపీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక దందా చేస్తున్నారని, బ్యారేజ్ కింద ఇసుక మొత్తం తవ్వేస్తున్నారని చెప్పారు. ఇసుక మాఫియా ద్వారా రోజుకు రెండు కోట్లు దోచుకుని దాచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల ధన దాహానికి రాజమండ్రి బ్యారేజ్ కు ముప్పు పొంచి ఉందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష టీడీపీ జనసేన పొత్తు. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 99 ఎమ్మెల్యే అభ్యర్థుల ఉమ్మడి జాబితా విడుదల చేశారు. ఈ అభ్యర్థులను చూసి వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కనిపించింది. 63 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముగ్గురు డాక్టర్లు ఒక ఐఏఎస్ అధికారితో పాటు అందరూ ఉన్నత విద్య చదివిన వారే కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే సీటు కేటాయించిన ఘనత చంద్రబాబుకి దక్కింది.
కాపు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసినప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని ఎక్కడికి వెళ్లారు గాడిదలు కాస్తున్నారా స్వాతంత్ర కాలం నుండి రాజంపేట కాపులకు ఇచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక మిథున్ రెడ్డికి కేటాయిస్తే వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించలేదు. ముఖ్యంగా ఈ జాబితాలో దళితులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి సామాజిక న్యాయం చేశారు. పొత్తుపై అవాక్కులు, చవాక్కులు పేలుస్తున్న వారికి నా సమాధానం కోటి 3 లక్షల 33 వేల ప్రజాభిప్రాయ సేకరణ మేరకే అభ్యర్థుల ఖరారు చేశారు గెలిచే అభ్యర్థులకే సీటు ఇచ్చారు అని తెలిపారు.
చిత్తూరు (Chittoor):
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జరిగే సీఎం సభకు మారుమూల ప్రాంతాలు పలమనేరు, కుప్పం, పుంగనూరు మిగిలిన ప్రాంతాల నుండి జన సమీకరణ లో భాగంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు దాదాపు 390 బస్సు సర్వీసులు గాను 90 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో, కుప్పం పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభ విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లాలోని నాయకులు జన సమీకరణలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్ష జరుగుతున్న సమయంలో బస్సుల కోసం విద్యార్దులు ఎదురుచూస్తున్నారు. కేవలం అరకొర బస్సు సర్వీసులు మాత్రమే కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.by CVR NEWSఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
- విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.by CVR NEWSఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పవిత్ర కాశీ నగరం వారణాసికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను…
- ఆగస్టు చివరి నాటికి నల్లమల సాగర్‌కు వెలిగొండ జలాలు.by CVR NEWSఆగస్టు చివరి నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి విడత పనులు పూర్తి చేసి నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టరేట్లో వెలిగొండ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరినందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్న తండ్రిపై కేసులు పెట్టి.. అన్న జగన్‌ను 16 నెలలు జైలులో వేసినా షర్మిల… కాంగ్రెస్ లో చేరడం సిగ్గుచేటన్నారు. షర్మిల చేస్తున్న ద్రోహానికి స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటారని అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో నల్లపురెడ్డి పాల్గొన్నారు. జగన్‌ను ఓడించేందుకే వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. ఇందుకు భగవంతుడు కూడా ఆమెను క్షమించడన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకు డిపాజిట్లు దక్కవని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్‌కు వివరించినట్లు తెలిపారు. రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని.. అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎంకు చెప్పానన్నారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు. ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తానని.. ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయానని మంత్రి ధర్మాన తేల్చి చెప్పారు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో, పంచుకో అన్నట్టుగా ఉండేదని ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోందని ఈ తేడాను గమనించాలని కోరారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటను గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పొదుపు సంఘాలకు నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు అవే పొదుపు సంఘాలు మంచి శాతంతో గ్రేడులు సాధించి గర్వంగా నిలబడ్డాయని చెప్పారు. కుట్రలు, కుతంత్రాల జెండాలు కట్టడమే చంద్రబాబు అండ్ కో అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు.
Read Also..
Read Also..
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
ఉరవకొండ, ఈనెల 23న ఉరవకొండలో జరిగే వైఎస్ఆర్ ఆసరా బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం కలెక్టరు గౌతమి, ఎస్పీ అన్బురా జన్, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పట్టణం లోని తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో జిల్లా ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. 7,876 లక్షల మంది మహిళలకు రూ.6,379 కోట్ల ఆసరా మొత్తాన్ని సీఎం విడుదల చేయనున్నారని తెలిపారు. ఏపీ ఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందురెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, ఎమ్మెల్యే శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జడ్పీ సీఈఓ వైభోమ్ నిదియాదేవి, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులురెడ్డి, స్థానిక తహసీల్దారు శ్రీధరమూర్తి పాల్గొన్నారు.