Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshChittoor ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..

ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు..

by Rama
RTC Bus

చిత్తూరు (Chittoor):

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జరిగే సీఎం సభకు మారుమూల ప్రాంతాలు పలమనేరు, కుప్పం, పుంగనూరు మిగిలిన ప్రాంతాల నుండి జన సమీకరణ లో భాగంగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని వైసీపీ నాయకులు దాదాపు 390 బస్సు సర్వీసులు గాను 90 బస్సులు మాత్రమే అందుబాటులో ఉండటంతో, కుప్పం పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభ విజయవంతం చేయడానికి చిత్తూరు జిల్లాలోని నాయకులు జన సమీకరణలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలను ఆర్టీసీ బస్సుల ద్వారా తరలిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ పరీక్ష జరుగుతున్న సమయంలో బస్సుల కోసం విద్యార్దులు ఎదురుచూస్తున్నారు. కేవలం అరకొర బస్సు సర్వీసులు మాత్రమే కుప్పం, పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.
    సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
  • భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
    సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
  • నేడు, రేపు చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.
    సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు, రేపు కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, వాటిపై చేపట్టిన చర్యలు, పురోగతికి సంబంధించిన నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: