93
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికాసేపట్లో పార్టీ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం.