తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికాసేపట్లో పార్టీ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం.
Tag:
party
హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి భారీ విజయాన్ని సాధిస్తారని, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజాజీవితంలో ఆల్ రౌండర్ అని, ముఖ్యమంత్రికి చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. గెలిచాక ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకు వస్తారన్నారు. ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు కానీ పిడికెడు మట్టి తీయలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ గెలిచినా తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.




Total views : 79009