కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో ఏలేస్వరం ప్రత్తిపాడు మండలాలో భారీ వర్ష పాతం నమోదు అయ్యింది. భారీ వర్షం కారణంగా నాలుగు మండలాలలో వరి, అరటి పలు వాణిజ్య పంటలు సుమారుగా వందలాది ఎకరాల్లో నష్టపోయినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కారణంగా వరి చేలు పూర్తిగా నీటమునిగాయని, ఈదురు గాలులకు అరటి తోటలు నేలకొరిగాయని పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిలిందని కన్నీరు పర్యతమయ్యారు. ప్రభుత్వ వెంటనే స్పందించి పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.
పంట నష్టంతో గగ్గోలు పెడుతున్న రైతులు..
59
previous post