తుఫాన్ కారణంగా తడిసినా, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఏపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజవర్గం పుళ్ళ, కైకరం, తల్లాపురం గ్రామాలలో పంట నష్టపోయిన వరి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ రైతుల వద్ద నుండి ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం వెంటనే సేకరించాలని కోరారు. అలాగే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు సరైన వసతి సదుపాయాలను కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అటల్ ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలుపరచలేదని విమర్శించారు. దీనివలన రైతులు బీమా సహాయాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తుఫాన్ కారణంగా ఇంత భారీ నష్టం జరిగినా ఇంతవరకు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయకపోవడంపై పురందరేశ్వరి మండిపడ్డారు.
అధికారులపై మండిపడ్డ పురందేశ్వరి
54
previous post