కొడుకు, కోడలు తో పాటు ఆర్టీసి బస్ ఎక్కిన మనువడికి డబ్బులు ఇద్దామని బస్సుకు ఎదురుగా వెళ్ళిన నానమ్మ ప్రమాదవశాత్తు అదే బస్సు కిందపడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం స్టేజ్ వద్ద జరిగింది. గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి కుమారుడు, కొడలు, మనువడు హైదరాబాద్ వెళ్దామని ఆర్టీసీ బస్సులో ఎక్కారు. ఇంటి సమీపంలోనే బస్ స్టాప్ ఉంది. అంతకుముందే తనను డబ్బులు అడిగి మారం చేసిన మనువడికి నానమ్మ లక్ష్మి డబ్బులు ఇవ్వడానికి కదులుతున్న బస్సు ఎదురుగా వెళ్ళింది. అది గమనించక డ్రైవర్ బస్సును ముందుకు పోనియ్యడంతో బస్ వెనుక టైర్ల కింద పడి భూక్య లక్ష్మి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందింది. లక్ష్మి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు కింద పడి వృద్ధురాలు మృతి..
84
previous post