టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం తేటగుంట వద్ద చారిత్రాత్మక 3వేల కి.మీ. మైలురాయికి చేరుకుంది. 3వేల కి.మీలు అధిగమించిన చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా తునిలో యనమల గెస్ట్ హౌస్ వద్ద పైలాన్ ను లోకేశ్ ఆవిష్కరించారు. ఈ మజిలీకి గుర్తుగా… వైసీపీ సర్కారు మూసేసిన పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈనెల 20వ తేదీన విశాఖపట్నంలో జరగనుంది. భోగాపురం ఎయిర్ పోర్టు సమీపాన గల పోలేపల్లిలో విజయోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది. నిర్వహణ కమిటీ బాధ్యులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి యువగళం విజయోత్సవసభను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. యువగళం ముగింపు సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది.
పైలాన్ ను ఆవిష్కరించిన లోకేశ్….
43
previous post