ఘనంగా మాజీ శాసనసభ్యులు మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం కందుకూరు విధానసభ మాజీ సభ్యులు దివంగత మానుగుంట ఆదినారాయణ రెడ్డి వర్ధంతి కార్యక్రమం, బుధవారం ఆయన స్వగ్రామం మాచవరంలో వేలాదిమంది అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన తనయులు ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి , వారి కుటుంబ సభ్యులు పాల్గొని స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి విగ్రహానికి నిలువెత్తు గజ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదినారాయణ రెడ్డి, ప్రజా బంధుగా, నిగరివిగా కందుకూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు .ఈ కార్యక్రమానికి తరలివచ్చిన వేలాదిమంది మానుగుంట అభిమానులు స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.
ఘనంగా మాజీ శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి వర్ధంతి
118
previous post