79
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచార సమయం నుంచీ ఆయన గొంతునొప్పితో బాధపడుతున్నారు. అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని ప్రసంగించడంతో ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది. ప్రస్తుతం చలి వాతావరణం పెరగడం, ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో అది మరింత ఎక్కువైంది. ఆయనను పరీక్షించిన వైద్యులు ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.