Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

బెండకాయతో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
Beṇḍakāya

బెండకాయను ఫ్రై చేసిన కూరగా చేసిన పులుసుగా చేసిన ఏ కూరకు రాని రుచి వస్తుంది. అయితే కొంత మంది బెండకాయను జిగురుగా ఉంటుందని తినటం మానేస్తు ఉంటారు. శరీరానికి అవసరమైన ఎన్నో కీలకమైన పోషకాలు బెండకాయలో ఉన్నాయి. ఇప్పడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. బెండకాయలో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన అలసట,నీరసం లేకుండా రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. బెండకాయ మధుమేహ రోగులకు సంజీవని అని చెప్పవచ్చు. బెండకాయలో సాల్యుబుల్ ఫైబర్స్ సమృద్ధిగా ఉండుట వలన కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారాన్ని తీసుకుంటాం. దాంతో బరువు తగ్గుతాం. బరువు తగ్గాలని అనుకొనే వారు బెండకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. బెండకాయలో సమృద్ధిగా ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పోషకాహార లోపం లేకుండా చేస్తాయి.ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

025719
Total views : 148215

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.