Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Health ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ధనియాల నీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

by Satya
Coriander water

ధనియాలను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ధనియాలను రాత్రి పడుకునే ముందు చల్లటి నీళ్లలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని కళ్లపై చల్లుకుని కడుక్కోవాలి. ఈ నీరు కళ్లకు మేలు చేస్తుంది. ఇలా రోజూ చేస్తే కంటి ఇన్ఫెక్షన్ దరిచేరదు. బహిష్టు సమస్యలు 6 గ్రాముల ధనియాల గింజలను 500 మి.లీ నీటిలో మరిగించి, 1 టేబుల్ స్పూన్ తేనె వేసి వేడిగా తాగాలి. ఇది శరీరంలోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఋతు చక్రం మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలను నివారించవచ్చు. ఈ గింజలను 4 స్పూన్లు రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. ధనియాల గింజల్లో ఉండే అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కళ్లలో దురద, మంట , ఎర్రబడడం వంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ధనియాలు నానబెట్టిన నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రోజూ ఈ నీటిని తాగవచ్చు. కొంతమంది మహిళలు ఎముకల సమస్యలతో బాధపడుతుంటారు. ప్రత్యేకంగా నానబెట్టిన ఈ నీటిని వారానికి రెండు సార్లు తాగితే ఈ సమస్య తీరుతుంది. 3 గ్రాముల ధనియా గింజల పొడిని 150 ml నీటిలో మరిగించి త్రాగాలి. ఇలా నీరు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు ఎముకలకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.

Advertisements

You may also like

Our Visitor

025718
Total views : 148113

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.