కందుకూరు పట్టణంలోని 6వ వార్డు కోటకట్ట మసీదు ప్రాంతంలో, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం నిర్వహించారు. ముందుగా ఆ ప్రాంతంలోని ముస్లింలంతా, పెద్దఎత్తున తరలివచ్చి నాగేశ్వరరావు కి ఘనస్వాగతం పలికారు. నాగేశ్వరరావు పై పూలు చల్లుతూ అభిమానంతో ముంచేత్తారు. గతంలో ఎప్పుడూ గడపదాటని ముస్లిం మహిళలు కూడా నాగేశ్వరరావు ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి, ఆయనను అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మహిళలంతా జగన్ ప్రభుత్వంపై, స్థానిక వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది అధికార పార్టీ నేతలు తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని, నోరు తెరిచి అడిగితే బెదిరిస్తున్నారని నాగేశ్వరరావుతో చెప్పారు. మేమంతా గతంలో వైసీపీకి ఓట్లు వేశాం. ఈ ప్రభుత్వం మాకేమీ చేయలేదు. సైడు కాలవలు శిధిలమై నీళ్ళు ముందుకు పోక కంపు, దోమలతో అల్లాడిపోతున్నాం. కనీసం అవి బాగు చేయడానికి కూడా వైసిపి నాయకులకు చేతకావడం లేదు. ఎన్నికలకు ముందేమో పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు. ఓట్లు వేయించుకున్న తర్వాత, తక్కువమందికి పట్టాలిచ్చి, ఇల్లు మీరే కట్టుకోవాలని చెబుతున్నారు. ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు తిరిగి ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తుకి గ్యారెంటీ కార్యక్రమానికి వెళ్ళకూడదంటూ మూడు రోజులుగా తమపై వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని మహిళలు తెలిపారు. ఒకవేళ కార్యక్రమానికి వెళితే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని ఉదయం కూడా తమను బెదిరించారని చెప్పారు. ఈసారి వైసీపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని, ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దతుగా నిలిచి, ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ స్థలాలు కేటాయించి, ఇల్లు కట్టించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అలాగే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా తమకు తెలియజేయాలని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గమనించి, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నాగేశ్వరరావు కోరారు. కందుకూరులో అందరికీ ఆమోగ్యమైన పరిపాలన రావాలంటే వైసీపీని ఓడించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ బాషా, వార్డు నాయకులు షేక్ ఫిరోజ్, షేక్ మున్నా, షేక్ మియాజాన్, షేక్ దావూద్ బాషా, షేక్ నాయబ్ రసూల్, సయ్యద్ అహ్మద్, షేక్ రియాజ్, షేక్ సలీం, షేక్ అబ్దుల్లా, షేక్ సంధాని, షేక్ జిలాని, షేక్ సుభాని, షేక్ నిషాహీద్ నాయకులు కండ్రా మాల్యాద్రి, చదలవాడ కొండయ్య, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, వడ్డెళ్ల రవిచంద్ర, బెజవాడ ప్రసాద్, గోచిపాతల మోషే, రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, పొడపాటి మహేష్, చుండూరి శీను, షేక్ సలాం, సయ్యద్ జియావుద్దీన్, రూబీ, గౌస్ బాషా, కరిముల్లా, షేక్ ఖలీల్, సవిడిబోయిన వెంకటకృష్ణ, ముచ్చు వేణు పులి నాగరాజు, ఫాజిల్, చంటి, బద్దిపూడి శిఖామణి, మమ్ముషా, వేముల ప్రసాద్, ముప్పవరపు వేణు గుమ్మ శివ, మచ్చ మనోహర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.