అధికారులకు దడ పుట్టిస్తున్న బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష. జిల్లా అంతట ప్రభుత్వ అధికారుల ఆఫీసులు, ఏరియా ఆసుపత్రులు, సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేసి అధికారుల పని తీరు మార్చుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి వైద్యశాలలో వసతులు ఎలా ఉన్నాయని పేషంట్లను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ అందించే సేవలు ఎలా అందుతున్నాయని రోగులని అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఏరియా వైద్యశాలలోని వైద్య పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించి వైద్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కొన్ని అవసరమైన పరికరాలు ఎందుకు అందుబాటులో లేవని వైద్యుల్ని ప్రశ్నించారు. బాలింతల వార్డులో సరైన వసతులు లేవని బాలింతలు కలెక్టర్కు చెప్పగా వైద్యులను బాలింతల వార్డులో సరైన వసతులు కల్పించాలని ఆదేశించారు. బాపట్ల ఏరియా వైద్యశాల సూపర్నెండ్ సిద్ధార్థ ను రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. బాపట్ల విజయలక్ష్మి హాస్పటల్లో వసతుల గురించి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్లో వసతులు కల్పించడంలో కానీ వైద్య సేవలు అందించడంలో గాని సిబ్బంది నిర్లక్ష్యము వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి కూడా ఏరియా వైద్యశాల తనిఖీల సమయంలో పాల్గొన్నారు.
అధికారులకు దడ పుట్టిస్తున్న జిల్లా కలెక్టర్…
52
previous post