నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం మండల కేంద్రం మైన గుడ్లూరు లో 1,2 గ్రామ సచివాలయలను డి పి.ఓ సుస్మితా రెడ్డి శుక్రవారం నాడు జనరల్ తనిఖీకి లలో భాగంగా రికార్డులను తనిఖీ చేశారు. 1 వ సచివాలయము పూర్తికాకుండా ఉండడంతో పాత పంచాయతీ ఆఫీసులో 1వ సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తునందున అక్కడ రికార్డులు పరిశీలించే అవకాశం లేక 2 వ సచివాలయంలో తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా ప్రతి సంవత్సరము పంచాయితీలలో జరిగిన లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా లేవా జరిగిన వాటికి క్యాష్ పుస్తకాలు, బిల్ పుస్తకాలు, ఆడిట్ సక్రమంగా జరిగిందా లేదా జనరల్ ఫండ్స్, 15 ఫైనాన్స్ నిధులు గ్రామంలో సక్రంగా ఉపయోగపడ్డాయా లేదా అని తనిఖీ చేశారు. అంతేకాకుండా సచివాలయం పరిధిలో ఎక్కడైనా పంచాయతీ తీర్మానం లేకుండా పనులు చేయడం వంటివి ఉన్నాయా అని పరిశీలించారు. ప్రతి ఒక్క పనికి బిల్ పుస్తకాలు రికార్డు సక్రమంగా ఉన్నదా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు సచివాలయాల్లో రికార్డులు తనిఖీ చేయడం సమయం సరిపోనందున తమ కార్యాలయాల వద్దకు తీసుకొని వెళ్లి తనిఖీ చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ కృష్ణ మోహన్, యు ఆర్ డి వెంకటేశ్వర్లు, 1.వ సచివాలయం పంచాయతీ కార్యదర్శి మహేష్ తో పాటు సచివాలయం సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
జనరల్ తనిఖీ…
62
previous post