రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగదని ప్రభుత్వ విప్ గా ఎన్నికై సిరిసిల్లకు వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్పుగా ఎన్నికై సిరిసిల్ల పర్యటనకు వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు పట్టణంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందన ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రేన్ సాయంతో పెద్ద పూలమాలతో ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని పలు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని, ఇచ్చిన హామీలలో భాగంగా ఇప్పటికే సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని, ప్రతిపక్షంలో కూర్చున్న టిఆర్ఎస్ పార్టీకి ఇంకా అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారని అభివృద్ధికి నోచుకోని పథకాలను కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా తీసుకొని అమలు చేసే దిశగా కృషి చేస్తుందని, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం పైన రాజకీయాలు చేస్తున్నారని, ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Read Also..