పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని సూచించారు. పార్టీ ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇటీవల హిప్ రిప్లేస్ మెంట్ చికిత్స చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, పార్లమెంట్ లో 93 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా ఇవాళ మరో 50 మంది ఎంపీలపై వేటు పడింది. దీంతో సభలు సజావుగా సాగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన గందరగోళం వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ తరఫున సభలలో వ్యవహరించాల్సిన విధానంపై ఎంపీలకు సూచనలు చేస్తారని సమాచారం.
Read Also..
Read Also..