కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ కాళేశ్వరంపై అనేక ఆరోపణలు, విమర్శలు చేసిందని సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐ అధికారులతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసును మేడిగడ్డకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు.
Read Also..
Read Also..