హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కొనసాగుతున్న నేషనల్ హైవే పనుల్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి శివారులోని కాల్వపై నిర్మించిన కల్వర్టు వద్ద చుట్టూ మట్టి సరిగా పోయించలేదు. దాంతో లోడ్ తో వెళ్తున్న లారీ దిగబడింది. దీంతో అటు వైపు వెళ్తున్న లారీలు, ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఇతరత్రా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాదారులు, ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. అక్కడికి చేరుకున్నపోలీసులు జెసిబి సహాయంతో లారీని బయటకు తీసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. హనుమకొండ నుండి సిద్దిపేట వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారిపై కొన్నిచోట్ల కంకర వేసి వదిలి వేస్తున్నారని, దాంతో దుమ్ము ధూళి లేస్తూ ప్రయాణికులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవే పనులను ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండా తూతూ మంత్రంగానే చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టుల వద్ద పోసిన మట్టిని రోడ్డు రోలర్ తో చదును చేయించి, రహదారిపై వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు సురక్షితంగా వెళ్లడానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
Read Also..