తాజాగా ఆన్లైన్ సెక్యూరిటీని రక్షించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే “సేఫ్టీ చెక్” అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. కోట్లాదిమంది యూజర్లు దీనిని వాడుతున్నారు. గూగుల్ క్రోమ్ పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్ నాలుగు చెకింగ్ టూల్స్ అందిస్తుంది. అవేవో తెలుసుకుందాం. సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో సేవ్ చేసిన ఏవైనా పాస్వర్డ్లు లీక్ అయ్యాయా లేదా హ్యాకర్లు తస్కరించారా అనే వివరాలను అని ఇది చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ వివరాలు లీకైనా లేదంటే ఎవరైనా కొట్టేసినా ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ చేస్తుంది. అప్పుడు ఓల్డ్ పాస్వర్డ్లు చేంజ్ చేసుకుని ప్రమాదం పెద్దదవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. సేఫ్టీ చెక్ ఫీచర్ క్రోమ్‌లో ఇన్స్టాల్ చేసిన ఏవైనా ఎక్స్టెన్షన్స్ హానికరమైనవా? కాదా? అని కూడా చెక్ చేస్తుంది. అవి హానికరమైతే యూజర్లను హెచ్చరిస్తుంది. తద్వారా వాటిని అన్ఇన్స్టాల్ లేదా డిలీట్ చేసుకోవచ్చు. మోస్ట్ అప్ టు డేట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉన్న క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా ఇది చెక్ చేస్తుంది. లేకపోతే బ్రౌజర్‌ను అప్డేట్ చేయమని అడుగుతుంది. లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఏవైనా వెబ్సైట్లకు పర్మిషన్స్ ఇచ్చారో లేదో ఇది చెక్ చేస్తుంది. యూజర్ చాలా కాలం పాటు ఆ వెబ్సైట్లను విజిట్ చేయకపోతే, ఆ పర్మిషన్స్ తీసేయమని సజెస్ట్ చేస్తుంది. క్రోమ్‌లోని త్రీ-డాట్స్ మెనూ నుంచి “సేఫ్టీ చెక్” ఫీచర్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అది కనిపెట్టే సమస్యలపై సకాలంలో యాక్షన్ తీసుకొని ఏ చెడు జరగకముందే జాగ్రత్త పడొచ్చు.
మరో కొత్త ఫీచర్
గూగుల్ క్రోమ్ జోడించిన కొత్త ఫీచర్ సేఫ్టీ చెక్ మాత్రమే కాదు. డెస్క్‌టాప్‌లో “మెమరీ సేవర్” మోడ్‌ను కూడా మెరుగుపరిచింది. క్రోమ్ ఫాస్ట్, స్మూత్‌గా రన్ రావడానికి మెమరీ సేవర్ కీలక పాత్ర పోషిస్తుంది. మెమరీ సేవర్ మోడ్ రెండు పనులను చేస్తుంది. ఇది ప్రతి ట్యాబ్ ఎంత మెమరీని ఉపయోగిస్తుందో చూపిస్తుంది, ఎక్కువగా వినియోగించే వాటిని క్లోజ్ చేయడానికి సులభతరం చేస్తుంది. దీనితో కొన్ని వెబ్సైట్లను “ఆల్వేస్ యాక్టివ్”గా మార్క్ కూడా చేసుకోవచ్చు. తద్వారా అనేక ట్యాబ్‌లు తెరిచినప్పుడు అవి తాత్కాలికంగా క్లోజ్ లేదా ఇగ్నోర్ అవ్వవు.
గూగుల్ క్రోమ్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్ లాంచ్..!
76
previous post