తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంత పల్లి గ్రామ శివారులో ఉన్న స్వర్ణ దుర్గ ఆశ్రమం వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో త్రాచుపాము ప్రత్యక్షమైంది. స్వర్ణ దుర్గ ఆశ్రమంలో స్వర్ణ దుర్గమ్మ తల్లి ఆలయంతో పాటు శివాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రుల సందర్భంగా నిత్యా అన్నదానం, కార్తీక మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే ఆదివారం మార్గశిర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోకి త్రాచు పాము ఒకటి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని చుట్టుకుని పడగవిప్పి బుసలు కొట్టింది. ఉదయం నుంచి సుబ్రమణ్య స్వామిని చుట్టుకుని సర్పం అలాగే ఉండిపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు అక్కడకు వచ్చి సుబ్రమణ్య స్వామి ఈ విధంగా వచ్చి తమ ఆశీస్సులు అందిస్తున్నారని నమస్కరించి వెళ్లిపోయారు.
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన త్రాచుపాము…
82
previous post