139
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి భారీగా పొగ మంచు కురుస్తుంది. ఈ పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు కురవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని వాహన దారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలిపారు. అలాగే ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పొగ మంచుకు బయటికి రాకూడదన్నారు. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.