107
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన విజయవాడ కాకాని తరుణ్ ను మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులు అడ్డుకున్నారు. బెంజ్ సర్కిల్ విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడీ లక్ష్మీనారాయణ సమక్షంలోనే రచ్చ రచ్చ చేశారు.