93
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం శక్తి నగర్ నందు సి.ఎస్.ఐ. చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తున్నరు. పరిశుద్ధ యోహాను దేవాలయంలో క్రైస్తవ సోదరులు. తెల్లవారుజామున మొదటి ప్రార్దనారాధనలో పిల్లలు పెద్దలు వృద్ధులు భక్తిశ్రద్ధలతో క్రీస్తు ఏసును ప్రార్దించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఘనం గా ఏర్పాట్లు చేశారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రాత:కాల ప్రార్థనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం బిష్‌పలు, పాస్టర్లు భక్తులకు దైవ సందేశం వినిపించి వ్యాకోపదేశం చేయనున్నారు.